Skip to main content

Namaste NRI

జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తొలి చిత్రం విడుదల

జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ తీసిన చిత్రాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫొటోలను ఆవిష్కరించారు. వైట్‌ హౌస్‌లో జరిగిన ప్రివ్యూ ఈవెంట్‌లో నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ సమక్షంలో జేమ్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ మొదటి చిత్రాన్ని విడుదల చేశారు. వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ మొదటి చిత్రం సైన్స్‌, టెక్నాలజీకి సంబంధించి చారిత్రాత్మక క్షణాలను సూచిస్తుందని బైడెన్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఓ చిత్రాన్ని ప్రివ్యూ చూశారు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన బైడెన్‌ ఇది చారిత్రాత్మక రోజున్నారు.  జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ తీసిన ఫొటోలను నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు సంయుక్తంగా విడుదదల చేయనునన్నారు.

Social Share Spread Message

Latest News