Skip to main content

Namaste NRI

అమ్మ కోరికను తీరుస్తున్న జాన్వీ కపూర్!

అలనాటి అందాల తార స్వర్గీయ శ్రీదేవి ముద్దుల కూతురైన జాన్వీ కపూర్  పలు బాలీవుడ్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రీదేవికి తన కూతురు హిందీ సినిమాలతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా నటించి పాపులర్ హీరోయిన్ గా ఎదగాలని చాలా కోరకగా ఉండేదట. జాన్వీకపూర్ కూడా ఆ సమయం కోసం వేచి చూసేది. ఎట్టకేలకు జాన్వీకపూర్‌ తెలుగు సినిమాలపై ప్రత్యేకమైన దృష్టిపెట్టినట్టుంది. తనకు తమిళంలోనూ అవకాశాలు భారీగా వస్తున్నా, ఆమె మాత్రం తెలుగు సినిమాలనే ఓకే చేస్తున్నది. ఇప్ప టికే ఎన్టీఆర్‌ దేవర-1లో ఆమె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే రామ్‌చరణ్‌, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలోనూ ఆమె కథానాయికగా ఎంపికైంది. రెండు దాదాపుగా మూడొం దలకోట్ల ప్రాజెక్టులే కావడం గమనార్హం.

జాన్వీ తెలుగులో నటిస్తే ఇలాంటి భారీ సినిమాల్లోనే నటిస్తుందని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో హీరో నాని సినిమాను కూడా ఆమె ఓకే చేసినట్టు ఫిల్మ్‌ నగర్‌లో బలంగా వినిపిస్తున్నది. 150కోట్ల బడ్జెట్‌తో దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని నటించనున్న సినిమాలో జాన్వీ కథానాయికగా నటించనుందట. ఈ సినిమాకోసం జాన్వీకి భారీ పారితోషికాన్ని ఆఫర్‌ చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు జాన్వీ కపూర్ తెలుగు లో మూడు సినిమాలలో హీరోయిన్ గా నటించబోతున్నదని తెలుస్తుంది. సో..తను టాలీవుడ్‌లో బిజీ కావాలన్న తన తల్లి శ్రీదేవి కోరిక జాన్వీకపూర్‌ ఇప్పుడు తీరుస్తుంది.

Social Share Spread Message

Latest News