Namaste NRI

జో బైడెన్ కీలక నిర్ణయం

ఉక్రెయిన్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ను రష్యా బలహీనపర్చలేదని, ఉక్రెయిన్‌పై దాడులకు వ్లాదిమిర్‌ పుతిన్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బలగాలతో దాడి చేయించి ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకున్నా అక్కడి ప్రజల మనసులను గెలుచుకోలేరని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై  రష్యా దాడులు దుర్మార్గమని మండిపడ్డారు. పుతిన్‌ను ప్రపంచం ఏకాకి చేయాలని పిలుపు  ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ప్రతి భాగాన్ని కాపాడతామన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థను స్థంభింపచేస్తామన్నారు.

                        అమెరికా గగనతలం నుంచి రష్యా విమానాల రాకపోకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ తరపున అమెరికా సేనలు యుద్ధం చేయవని తెలిపారు. రష్యాలో ఆర్థిక సంక్షోభానికి పుతినే కారణమని అన్నారు. పుతిన్‌ ఓ నియంత. రష్యా ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేస్తాం. ఉక్రెయిన్‌ ప్రజలతో అమెరికా ఉంది. అమెరికా, దాని భాగస్వామ్య దేశాలు నాటోలోని ప్రతి అంగుళం కాపాడుకుంటాయి అని  బైడెన్‌ హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events