Skip to main content

Namaste NRI

దక్షిణ కరోలినా ప్రైమరీలో జో బైడెన్‌ ఘన విజయం

డెమోక్రటిక్‌ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న  జో బైడెన్‌ తొలి గెలుపు నమోదు చేశారు. దక్షిణ కరోలినా ప్రైమరీలో ఘన విజయం సాధించారు. మిన్నెసొటా ప్రతినిధి డీన్‌ ఫిలిప్స్‌, రచయిత మెరియన్‌ విలియమ్సన్‌పై ఆయన గెలుపొందారు. 2020లో అంచనాలను తలకిందులు చేస్తూ దక్షిణ కరోలినా ఓటర్లు తన విజయానికి బాటలు వేశారని బైడెన్‌ అన్నారు. 2024లోనూ అదే పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఓటమి తప్పదని అన్నారు.

Social Share Spread Message

Latest News