Skip to main content

Namaste NRI

సమయానికే.. తీస్‌మార్‌ ఖాన్‌

ఆది సాయికుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం తీస్‌మార్‌ ఖాన్‌. పాయల్‌ రాజ్‌పుత్‌ నాయిక. సునీల్‌, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కళ్యాణ్‌ జి.గోగణ దర్శకత్వంలో వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే గ్లింప్స్‌, టీజర్‌, ఫస్ట్‌సింగిల్‌ను విడుదదల చేసింది చిత్రబృందం. సమయానికే అంటూ ఈ సాగే ఈ సినిమా రెండో పాట వీడియోను రిలీజ్‌ చేశారు. సాయి కార్తీక్‌ స్వరపరచిన ఈ మెలోడీ ట్యూన్‌కు రాకేందు మౌళి సాహిత్యం అందించగా శ్రుతి ఆలపించారు. ఇందులో అనూప్‌సింగ్‌ ఠాకూర్‌, కబీర్‌సింగ్‌ తదితరులు నటించారు. ఆగస్ట్‌ 19న విడుదల కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: యాళ్ల తిర్మల్‌ రెడ్డి, సంగీతం: సాయికార్తీక్‌.

Social Share Spread Message

Latest News