Skip to main content

Namaste NRI

పవన్‌ కళ్యాణ్‌ చేతుల మీదుగా కళాపురం టీజర్‌ విడుదల

సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, రక్షిత్‌ అట్లూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కళాపుం..ఈ  ఊరిలో అందరూ కళాకారులే అన్నది ఉపశీర్షిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, పోస్టర్స్‌, సాంగ్‌ అన్నీ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచాయి. ఇప్పుడి అంచనాలను మరింతగా పెంచేలా మేకర్స్‌ కళాపురం సినిమా టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో పవన్‌ కల్యాణ్‌  విడుదల చేశారు. సినిమా తీయాలని కలలు కనే ఓ ఔత్సాహిక దర్వకుడి కథ ఇది. అతను ఓ నిర్మాతతో కలిసి సినిమా చేయాలనుకుంటారు. అయితే తాను ఉంటున్న కళాపురం గ్రామంలో కొంత అతను ఓ నిర్మాతతో కలిసి సినిమా చేయాలనుకుంటారు. అయితే తాను ఉంటున్న కళాపురం గ్రామంలో కొంత సినిమా షూట్‌ చేయాలనే షరతు విధిస్తాడు నిర్మాత. అందుకు తగ్గట్లుగానే ఆ ఊరిలో చితీక్రరణ మొదలు పెడతారు. కానీ నిర్మాత వద్ద ఉన్న డబ్బు కోసం మధ్యలో పోలీసులు, రౌడీలు ఎంట్రీ ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు సినిమా ఎలా పూర్తి చేశారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? అన్నది తెరపై చూసి తెలసుకోవాలి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. మణిశర్మ స్వరాలందించారు. ఈ  చిత్రాన్ని జీ స్టూడియోస్‌, ఆర్‌ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రజనీ తాళ్లూరి నిర్మించారు. ఆగస్టు 26న విడుల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events