హుజూరాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డి అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రైతులంతా సంతోషంగా ఉన్నారు. కాళేశ్వరం, ఎల్‌ఎండీ జలాలతో సమృద్ధిగా పంటలు పండుతున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్ అభివృద్ధిని విస్మరించారు. ప్రజా సమస్యల కోసం కాదు. స్వలాభం కోసం ఆయన రాజీనామా చేశారు అని అన్నారు.