Namaste NRI

వైట్ హౌజ్ లో భారతీయ అమెరికన్ కు కీలక బాధ్యతలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారత సంతతికి చెందిన అమెరికా పాలసీ అడ్వైజర్‌ గౌతమ్‌ రాఘవన్‌కు పదోన్నతి లభించింది. వైట్‌హౌజ్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌  వర్సవల్‌ అధిపతిగా రాఘవన్‌కు పదోన్నతి కల్పించారు.  వైట్‌హౌజ్‌ పీపీఓను ఆఫీస్‌ ఆఫ్‌ ప్రెసిడెన్షియల్‌ పర్సనల్‌గా కూడా పిలుస్తారు. అయితే వైట్‌హౌజ్‌లో జరిగే కొత్త అపాయింట్‌మెంట్లను పీపీవో ఆఫీసు పరిశీలిస్తుంది. శ్వేతసౌధంలో పనిచేసే అభ్యర్థులను పీపీవో ఆఫీసు పూర్తిగా అంచనా వేసి రిక్రూట్‌ చేస్తుంది. గౌతమ్‌ రాఘవన్‌ ప్రస్తుతం పీపీవో డిప్యూటీ  డైరెక్టర్‌గా చేస్తున్నారు. అయితే వైట్‌హౌజ్‌ పీపీవో హెడ్‌ పోస్టులో ఉన్న క్యాథే రస్సెల్‌కు ఇటీవల కొత్త పదవి దక్కింది. యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా రస్సెల్‌ వెళ్తున్నారు. దీంతో ఆయన స్థానంలో ఖాళీ అయిన పోస్టుకు గౌతమ్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. క్యాథే రస్సెల్‌తో కలిసి గౌతమ్‌ బాగా పనిచేశారని, పీపీవో కొత్త డైరక్టర్‌గా రాఘవన్‌ బాధ్యతలు చేపడుతారని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు.

                 గౌతమ్‌ రాఘవన్‌ ఇండియాలో పుట్టారు. సియాటిల్‌లో ఆయన పెరిగారు. స్టాన్‌ఫార్డ్‌ యూనివర్సిటీలో ఆయన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. రాఘవన్‌ వయసు 40 ఏళ్ల పైనే. ఆయన స్వలింగ సంపర్కుడు. భర్త కూతురితో కలిసి వాషింగ్టన్‌ డీసీలో జీవిస్తున్నారు. 2020, జనవరి 20 నుంచి అధ్యక్షుడిగా డిప్యూటీ అసిస్టెంట్‌గా చేశారు. బైడెన్‌, హ్యారిస్‌ పరిపాలనా విభాగం తొలుత రిక్రూట్‌ చేసింది రాఘవన్‌నే. వెస్ట్‌ వింగర్స్‌, స్టోరీస్‌ ఫ్రమ్‌ ద డ్రీమ్‌ చేజర్స్‌, చేంజ్‌మేకర్స్‌, హోప్‌ క్రియేటర్స్‌ ఇన్‌సైడ్‌ ద ఒబామా వైట్‌ హౌజ్‌ అన్న పుస్తకానికి ఆయన ఎడిటర్‌గా చేశారు.

Social Share Spread Message

Latest News