Skip to main content

Namaste NRI

రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూ మద్దతు

భారత్‌లో ఓ సిక్కు టర్బన్‌, కడెం ధరించేందుకు, గురుద్వారాకు వెళ్లేందుకు అనుమతి ఉంటుందా అనే దానిపై పోరాటం జరుగుతున్నది అంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ సహ వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ సమర్థించారు. అమెరికా పర్యటనలో భాగంగా వర్జీనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌ వ్యాఖ్యలపై స్పందించిన పన్నూ భారత్‌లో సిక్కులకు ఉన్న ముప్పుపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ధైర్యంతో, మార్గదర్శకంగా చేసినట్టు ఉన్నాయని పేర్కొన్నారు. భారత్‌లో 1947 నుంచి సిక్కులు ఎదుర్కొంటున్న వాస్తవిక పరిస్థితులను చాటేలా రాహుల్‌ వ్యాఖ్యలు ఉన్నాయని, తమ ఖలిస్థాన్‌ ఏర్పాటు డిమాండ్‌ను సమర్థిస్తున్నాయని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News