తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కొవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా వెల్లడిరచారు. తనకు టీకా వేసిన డాక్టర్ శ్రీకృష్ణ, నర్సు కెరినా జ్యోతికి మంత్రి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా విపత్తు వేళల్లో సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.