Namaste NRI

హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు లో లెజెండరీ యాక్టర్

పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం హరిహరవీరమల్లు. చారిత్రక పాత్రలతో కూడిన ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మరో అదనపు ఆకర్షణ తోడైంది. దేశంలోని లెజండరీ నటుల్లో ఒకరైన అనుపమ్‌ ఖేర్‌ ఈ సినిమాలో భాగం ఆయ్యారు. ఇందులో అత్యంత కీలకమైన పాత్రను అనుపమ్‌ఖేర్‌ పోషించనున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఇందులో అనుపమ్‌ఖేర్‌, పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్‌ తెలిపారు.

Ixora 45

పవర్‌స్టార్‌ లైఫ్‌లో ఓ లాండ్‌మార్క్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని, యువ దర్శకుడు జ్యోతికృష్ణ అత్యంత బాధ్యతాయుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని, అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమా ను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. నిధి అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ పరమహంస, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కళ: తోట తరణి, సమర్పణ: ఎ.ఎం.రత్నం, నిర్మాత: ఎ.దయాకర్‌రావు, నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్స్‌.

Mayfair 45
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events