తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ నటిస్తున్న చిత్రం లియో. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. ఎస్.ఎస్.లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్‌దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ విజయ్ ఇమేజ్‌కు తగిన యూనివర్సల్ కథతో రూపొందుతున్న చిత్రమిది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్.














