Namaste NRI

గాడ్‌ ఫాదర్‌ ను కలిసిన లైగర్‌

ముంబైలో గాడ్‌ ఫాదర్‌ని కలిశారు లైగర్‌. చిరంజీవి హీరోగా మోహన్‌ రాజా దర్శకత్వంలో గాడ్‌ ఫాదర్‌ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.  ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ముంబైలో జరిగింది. చిరంజీవి, సల్మాన్‌ ఖాన్‌లపై ప్రభుదేవా కొరియోగ్రఫీతో ఓ పాటను చిత్రీకరించారు. కాగా లైగర్‌ ప్రమోషన్స్‌ కోసం ముంబైలో ఉన్న ఈ సినిమా టీమ్‌ గాడ్‌ ఫాదర్‌  షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లింది. చిరంజీవి, సల్మాన్‌తో కాసేపు టైమ్‌ స్పెండ్‌ చేసింది. విజయ్‌ దేవరకొండతో పాటు, దర్శకనిర్మాతలు పూరి జగన్నాథ్‌, చార్మి తదితరులు గాడ్‌ఫాదర్‌ సెట్లో సందడి చేశారు. గాడ్‌ ఫాదర్‌ చిత్రం అక్టోబరులో దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు  రానున్న సంగతి తెలిసిందే. విజయ్‌ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన లైగర్‌ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: విష్ణుశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్‌, చార్మి, కరణ్‌జోహార్‌, అపూర్వ మోహత, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Social Share Spread Message

Latest News