Namaste NRI

నెదర్లాండ్స్ లో లాక్ డౌన్

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వేగంగా  విస్తరిస్తున్నది. ఈ క్రమంలో నెదర్లాండ్స్‌ ప్రభుత్వం అప్రమత్తమయింది. క్రిస్‌మస్‌ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా కఠినమైన లాక్‌డౌన్‌ విధించింది. ఇది నేటి నుంచి జనవరి రెండో వారం వరకు అమలులో ఉంటుందని ప్రధాని మార్క్‌ రూట్‌ తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసరం కాని దుకాణాలు, బార్‌లు, జిమ్‌లు, క్షౌరశాలలు, బహిరంగ వేదికలు మూతపడనున్నాయి. క్రిస్‌మస్‌ నేపథ్యంలో ఒక్కో ఇంటికి ఇద్దరు అతిథులకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. జనవరి 9 వరకు పాఠశాలలు మూసి ఉంటాయని, లాక్‌డౌన్‌ నిబంధనలు జనవరి 14 వరకు మల్లో ఉంటాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News