Namaste NRI

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా  లవ్‌ టుడ్‌

ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం లవ్‌ టుడే. ఇవనా కథానాయిక.తమిళంలో విడుదలైన ఈ సినిమాని, తెలుగులో  నిర్మాత దిల్‌రాజు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో గత వారం విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నిర్మాణ వ్యయం కంటే పది రెట్లు లాభాల్ని సాధిస్తుందని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయని చిత్రవర్గాలు తెలిపాయి. నవంబర్‌ మూడో వారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.  సత్య రాజ్‌, రాధికా శరత్‌కుమార్‌ పోషించిన ప్రధాన పాత్రలు సినిమాకు ప్రదాన బలంగా మారాయి.  కల్పతి అఘోరాం, కల్పతి ఎస్‌.గణేశ్‌ నిర్మాతలు. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events