Skip to main content

Namaste NRI

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్ర విమాన ప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది.ఈ దుర్ఘటనలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు మృతి చెందారు. ముంబయి నుంచి బారామతికి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళుతుండగా ఉదయం 8.45 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలు అయింది. ప్రమాదం జరిగిన విమానంలో ఎవరూ బ్రతకలేదని డీజీసీఏ వెల్లడించింది. అజిత్ పవార్ తో పాటు ముంబయి పీఎస్ వో వదీప్ జాదవ్, కెప్టెన్ సుమీత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్, ఫైట్ అటెండెట్ పింకీ మాలి చనిపోయినట్లు తెలిపింది. అజిత్ పవార్ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత రావ్ పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరత్ పవార్ సోదరుడు. అజిత్ పవార్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సునేత్ర పవార్ రాజ్యసభ ఎంపీగా వున్నారు.

Social Share Spread Message

Latest News