తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే దివంగత మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు జియావుద్దీన్ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకొన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తపా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
