Skip to main content

Namaste NRI

మూడు భాషల్లో సంగీత హారర్ డ్రామా మసూద

సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం మసూద. సాయికిరణ్‌ దర్శకుడు. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రాహుల్‌ యాదవ్‌ నక్క నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హారర్‌ డ్రామా కథాంశమిది. హారర్‌ డ్రామా  చూసి చాలా కాలమైంది. ఈ తరహా కథల్లో విభిన్నంగా నిలిచే చిత్రమవుతుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు. శుభలేఖ సుధాకర్‌, అఖిలా రామ్‌, బాంధవి శ్రీధర్‌, సత్యం రాజేష్‌, సత్యప్రకాష్‌, సూర్యారావు తదితరులు నటిస్తున్నారు. నవంబర్‌ 11న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమటోగ్రఫీ: నగేష్‌ బానెల్‌, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌ విహారి, నిర్మాత: రాహుల్‌ యాదవ్‌ నక్కా, రచన`దర్శకత్వం: సాయి కిరణ్‌.

Social Share Spread Message

Latest News