Skip to main content

Namaste NRI

నాతో నేను  ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

సాయికుమార్‌, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్‌ కనకాల, శ్రీనివాస్‌ సాయి. దీపాలి రాజ్‌పుత్‌ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం నాతొ నేను. శాంతి కుమార్‌ తూర్లపాటి (జబర్దస్ట్‌ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్‌ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న గ్రాండ్‌గా విడుదల కానుందీ చిత్రం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకగా వైభవంగా జరిగింది. సాయికుమార్‌ మాట్లాడుతూ నాతో నేను కూడా మంచి కథ. మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు. పాటలు, మాటలు అన్ని చక్కగా కుదిరాయి. నిర్మాత తన శక్తి దాటి ఖర్చు చేశారు. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. టీమ్‌ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. మంచి కథ, మంచి టీమ్‌తో ఇంతవరకూ రాగలిగాం. ఈ చిత్రంలో ప్రతి సీన్‌ మనసును కదిలిస్తుంది. ఈ నెల 21 గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. దర్శకనిర్మాతలతోపాటు మా అందరికీ మంచి పేరు, లాభాలు తీసుకురావాలి  అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన నటీనటులు, సాంకేతిక నిపుణులు, అతిథులు చిత్రం సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.

Social Share Spread Message

Latest News