Skip to main content

Namaste NRI

 మైక్రోసాఫ్ట్‌ కీలక ప్రకటన … ప్రపంచవ్యాప్తంగా

 మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అయిన క్రౌడ్‌స్ట్రైక్‌ చేసిన ఒక సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని, దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల విండోస్‌ డివైజ్‌లపై పడినట్టు ప్రస్తుతం అంచనా వేస్తున్నట్టు తన బ్లాగ్‌లో వెల్లడించింది. మొత్తం విండో స్‌ డివైజ్‌లలో ఇది ఒక శాతం కంటే తక్కువేనని పేర్కొన్నది. మైక్రోసాఫ్ట్‌ అజూర్‌లో సమస్యను పరిష్క రించేందుకు క్రౌడ్‌స్ట్రైక్‌ సాయం చేసినట్టు వెల్లడించింది. ఇందుకోసం అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, గూగుల్‌ క్లౌడ్‌ తో కూడా కలిసి పని చేసినట్టు తెలిపింది.

Social Share Spread Message

Latest News