Skip to main content

Namaste NRI

సౌదీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు .. మంత్రి లోకేశ్ సాయం

ఉపాధి కొరకు అరబ్బు ఎడారి దేశానికి వచ్చి ఇబ్బందులను ఎదుర్కోంటున్న చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తుర్కపల్లె గ్రామానికి చెందిన శేఖ్ హసీనా అనే 25 ఏళ్ళ యువతి తనను రక్షించాలంటూ మంత్రి నారా లోకేశ్ కు సామాజిక మాధ్యమాల ద్వారా చేసిన విన్నపం ఫలించింది.  ​ఈ మేరకు సౌదీ అరేబియాలోని ఎపి ఎన్నార్టీ ప్రతినిధి, చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరుకు చెందిన చిట్టలూరి రంజీత్ హాసినాను మరో ప్రతినిధి ముజ్జమ్మీల్ శేఖ్ సహాయంతో రియాధ్ నగరంలో హాసీనాను సురక్షితంగా భారతీయ ఎంబసీ అధికారులకు అప్పగించారు. గత కొన్ని రోజుల నుండి సరిగ్గా తిండిలేక నీరసించిపోయిన అమెకు భోజన ఏర్పాట్లు చేయించి కొంత మెర నగదు కూడ అందించారు.

హాసీనాను సురక్షితంగా చేర్చిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధకృష్ణాతో పాటు విజయవాడలోని ఎపి ఎన్నార్టీ అధికారులకు కూడ వారు తెలియజేసారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారుల సహాయంతో అమె వీసాను రద్దు చేసి స్వదేశానికి పంపించడానికి ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తారని రంజీత్ చెప్పారు.

Social Share Spread Message

Latest News