Skip to main content

Namaste NRI

50 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా… యూకేలో

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దెబ్బ యూరప్పై భారీగానే పడిరది. ఐరోపా దేశాలన్నీ విద్యుత్తు సంక్షోభంలోకి వెళ్తున్నాయి. 50 ఏండ్లలో ఎప్పుడూ లేనంతగా విద్యుత్తు కోతలు విధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. యూకేలో 40 శాతానికి పైగా గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఆ గ్యాస్ను రష్యా నుంచి దిగుమతి చేసుకొనేది. అయితే, ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. దానికి ప్రతీకారంగా రష్యా యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. దీంతో ఈయూలో గ్యాస్ సంక్షోభం ఏర్పడిరది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ సహా ఐరోపా దేశాలు తీవ్ర విద్యుత్తు సమస్యను ఎదుర్కొంటున్నాయి.
70 ఏండ్లలో ఎన్నడూ చూడని విద్యుత్తు కరవును ఇటలీ ఎదుర్కొంటున్నది. ఐరోపా బ్యాటరీగా పేర్కొంటున్న నార్వే రిజర్వాయర్లు కూడా సగం ఖాళీ అయ్యాయి. కాగా శీతాకాలంలో కరెంటు కష్టాలు ఉంటాయని, వచ్చే ఏడాది పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని ఇప్పటికే యూకే నేషనల్ గ్రిడ్ స్పష్టం చేసింది. నిల్వ చేసిన లిక్విడ్ గ్యాస్ మొత్తం అయిపోతే శీతాకాలంలో ప్రతిరోజూ పవర్ కట్ ఉండొచ్చని చెప్తున్నది.

Social Share Spread Message

Latest News