Skip to main content

Namaste NRI

సాయితేజ్ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం

సుప్రీమ్ హీరో సాయితేజ్ నటిస్తున్న చిత్రం నూతన షూటింగ్ దశలో ఉంది. కార్తీక్ దండు దర్శకుడు. ఈ చిత్రానికి విక్రాంత్ రోణ, కాంతారా చిత్రాల ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. సాయితేజ్ నటిస్తున్న మిస్టీరియల్ థ్రిల్లర్ కథా చిత్రమిది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే సుకుమార్ రైటింగ్స్ సంస్థల సంయుక్త నిర్మాణంలో ప్రముఖ నిర్మాత బీవీఎన్ఎస్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. సంయుక్త మీనన్ నాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్యామ్దత్, ఎడిటర్: నవీన్ నూలి.

Social Share Spread Message

Latest News