Skip to main content

Namaste NRI

నాగచైతన్య థాంక్యూ సినిమా ట్రైలర్ రిలీజ్

నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం థాంక్యూ. విక్రమ్‌ కుమార్‌ దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌ పతాకంపై దిల్‌రాజు శిరీష్‌ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, మాళవిక నాయర్‌ కథానాయికలు. ఈ నెల 22న ప్రపంచవాయప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. తనని తాను సరిచేసుకోవడానికి అభిరామ్‌ చేసిన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం. ఆ ఆభి పాత్రనే చైతూ పోషించారు. యుక్త వయసు కుర్రాడిగా కాలేజీ స్టూడెంట్‌గా పరిణతి చెందిన వ్యక్తిగా ఆయన జీవితంలో మూడు దశల్ని ప్రచార చిత్రంలో చూపించారు. ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమకంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది అంటూ ట్రైలర్‌లో చైతన్య చెప్పిన డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. ట్రైలర్‌ విడుదల  వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ అభిరామ్‌ ప్రయాణమే ఈ సినిమా. ఓ నటుడిగా ఇన్ని వేరియేషన్‌స చూపించడానికి, విభిన్నమైన లుక్స్‌లో కనిపించడానికి ప్రతిసారీ అవకాశం రాదు. ఈ చిత్రంతో నాకు దొరికింది.  తను లేకపోతే అభి ప్రయాణం ఉండదు.  రిల్‌రాజు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రం కోసం సహకరించిన చిత్ర బృందం మొత్తానికి థ్యాంక్స్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో రాశి ఖన్నా, సాయి సుశాంత్‌, విక్రమ్‌ కె.కుమార్‌, దిల్‌ రాజు, బీవీఎస్‌ రవి, చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events