Namaste NRI

నాన్సీ పెలోసీ సంచలన నిర్ణయం.. రెండు దశాబ్దాల తర్వాత

అమెరికాలోని ప్రతినిధుల సభ  (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటెటివ్స్‌ ) స్పీకర్‌ పదవి నుంచి వైదొలగనున్నట్లు నాన్సీ పెలోసీ ప్రకటించారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్పష్టమైన మెజారిటీ సాధించారు. ఈ నేపథ్యంలో అధికార డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే జనవరిలో బాద్యతల నుంచి తప్పుకుంటానని సభలో తెలిపారు. శాన్‌ఫ్రాన్సిస్కో ప్రతినిధిగా గత 35 ఏళ్ల తన ప్రస్తానాన్ని సభలో కొనసాగిస్తానని స్పష్టం చేశారు. సుమారు 20 ఏళ్ల పాటు డెమోక్రాటిక్‌  పార్టీకి సారథ్యం వహించిన ఏకైక మహిళ నేతగా, అత్యంత సమర్థురాలిగా పేలోసీ పేరు తెచ్చుకున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events