Skip to main content

Namaste NRI

నంద‌మూరి కల్యాణ్‌రామ్‌ కొత్త సినిమా మొదలు

నంద‌మూరిహీరో కల్యాణ్‌రామ్‌ కొత్త సినిమా మొదలైంది. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. విజయశాంతి కీలక పాత్ర పోషించనుండటం విశేషం. ప్రదీప్‌ చిలుకూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్‌ కొట్టగా, మురళీమోహన్‌ కెమెరా స్విచాన్‌ చేశారు.  ముప్పా వెంకయ్యచౌదరి స్క్రిప్ట్‌ అందించారు. లేడీ అమితాబ్ బచ్చ‌న్‌ విజ‌య‌శాంతి ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌టం విశేషం. క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయేలా, ఆయ‌న పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సి.రామ్‌ప్రసాద్‌, సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, నిర్మాణం: అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events