Namaste NRI

గాజా విషయంలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు : జో బైడెన్

ఇజ్రాయెల్‌-హమాస్‌ నడుమ యుద్ధం మొదలైనప్పటి నుంచి తొలిసారి ఇజ్రాయెల్‌ను అమెరికా తప్పుపట్టింది. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు బెంజామిన్‌ నెతన్యాహూ తీరుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నెతన్యాహూ గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు తక్షణ కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నా. ఈ విరామ సమ యంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు అని ఓ కార్యక్రమంలో బైడెన్‌ వ్యాఖ్యానించారు.

పోయిన వారం గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన డ్రోన్‌ దాడిలో అమెరికాకు చెందిన ఓ ఎన్జీవో సంస్థలో పనిచేసే ఏడుగురు స్వచ్ఛంద సేవకులు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. జోర్డాన్‌, సౌదీ, ఈజిప్ట్‌ దేశాలు కూడా నిత్యం సాయం అందించేలా వారితో సంప్రదింపులు జరుపుతు న్నామని, వారు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారని, ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్‌ వ్యవహరించాల్సిన తీరు సరిగా లేదని విమర్శించారు. అయితే గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events