Skip to main content

Namaste NRI

అమెరికాలో కొత్తగా.. భారత కాన్సులేట్‌ కేంద్రాలు

ప్రవాస భారతీయులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అమెరికాలోని భారత రాయబారి వినయ్‌ క్వత్రా తెలిపారు. ఇందులో భాగంగా కొత్తగా ఎనిమిది దౌత్య దరఖాస్తు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

ఈ కేంద్రాలు అమెరికాలోని లక్షలాది మంది భారతీయులకు పాస్‌పోర్ట్‌, వీసా, ఓవర్‌సీస్‌ సిటిజెన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా(ఓసీఐ) కార్డు దరఖాస్తు ప్రక్రియ సహా వివిధ సేవలను సులభతరం చేస్తాయని చెప్పారు.  కొత్తగా దౌత్య దరఖాస్తు కేంద్రాలను బోస్టన్‌, కొలంబస్‌, డాలస్‌, డిట్రాయిట్‌, అడిసన్‌, ఒర్లాండో, రాలెయిగ్‌, శాన్‌జోస్‌ ప్రాంతాల్లో నెలకొల్పామని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News