అమెరికా దళాల ఉపసంహరణ అనంతరం అఫ్గాన్‌లో దౌత్యకార్యాలయాలు ఉనికి కొనసాగించాలా లేదా అనే దానిపై ఇంకా నిర్ణయించలేదని వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకి తెలిపారు. తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించేందుకు కొన్ని హామీలు ఇవ్వవలసి ఉందని అమెరికా వెల్లడిరచింది. అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే సమస్యేలేదని అమెరికా స్పష్టం చేసింది. ఉగ్రమూకలకు అఫ్గాన్‌ను కేంద్రంగా మార్చవద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉగ్రవాదం, మానవ హక్కులు, మహిళల హక్కులపై తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందన్నారు. అమెరికా పౌరుల రక్షణే తమ తొలి ప్రాధన్యమని తేల్చి చెప్పింది. బలగాల ఉపసంహరణ తర్వాత అమెరికా తాలిబన్లతో చర్చలు జరపాలని తాలిబన్లు కోరినట్లు అమెరికా ప్రతినిది ఫ్రైజ్ తెలిపారు. నిర్ణయాలు తీసుకునేముందు అమెరికాకు మరిన్ని హామీలు ఇవ్వవలసిన అవసరం ఉందని తెలిపింది.