Skip to main content

Namaste NRI

వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ అవార్డు

వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ అవార్డు దక్కింది. వైద్యులు కాలిటన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు పురస్కారం వరించింది. కరోనా మహమ్మారికి కట్టడికి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి కోసం చేసిన కృషికి కాలిటన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసినట్లు నోబెల్‌ అసెంబ్లీ పేర్కొంది. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్ల అభివృద్ధి చేయడానికి సహాయపడే న్యూక్లియోసైడ్‌ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు నోబెల్‌తో గౌరవిస్తున్నట్లు జ్యూరీ పేర్కొంది.  కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని 50 మంది ప్రొఫెసర్‌లతో కూడిన నోబెల్ అసెంబ్లీ ఏటా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేస్తున్నది. మానవజాతి ప్రయోజన కోసం వైద్యరంగంలో గణనీయమైన కృషి చేసిన శాస్త్రవేత్తలను జ్యూరీ గుర్తిస్తుంది. స్జోల్నోక్‌లో 1955లో జన్మించిన కటాలిన్ కరిక్ స్జెడ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెససర్‌గా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో పెరెల్‌మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అనుబంధ ప్రొఫెసర్‌గా ఉన్నారు. డ్రూ వెయిస్‌మన్‌ పెన్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ కొనసాగుతున్నారు. ఈ వారంలో నోబెల్‌ పురస్కారాలను ప్రకటించనుండగా.. డిసెంబర్‌ 10న ప్రదానం చేయనున్నారు.

Social Share Spread Message

Latest News