Namaste NRI

ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి..డా. నోరి దత్తాత్రేయుడు

ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి గా నియమించబడిన జయరాం కోమటి అమెరికాలో తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంలో చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో కోమటి జయరాం ఆత్మీయ సమావేశం నిర్వహించి సన్మానించారు. ఇందులో డా. నోరి దత్తాత్రేయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రాభి వృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తించడం,మంచి ఆహారపు అలవాట్ల ద్వారా క్యాన్సర్ ను నివారించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, చంద్రబాబు తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను పంచుకున్నారు.

కోమటి జయరాం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గూగుల్ డాటా సెంటర్ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి అని అన్నారు. అనంతరం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ పంపిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. డా. నోరి దత్తాత్రేయుడు ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని రవి పొట్లూరి సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమంలో గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు,శ్రీధర్ అప్పసాని,రాధకృష్ణ మాల్పూరి,రంజిత్ కోమటి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events