Skip to main content

Namaste NRI

ఉత్తర కొరియా మరో ప్రయోగం.. షాక్ లో అమెరికా, దక్షిణ కొరియా

ఉత్తర కొరియా ఒక అనుమానాస్పద క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా బలగాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం యూఎస్‌ వైఎస్‌ ప్రెసిడెంట్‌ కమలా హ్యారిస్‌ దక్షిణ కొరియా పర్యటనకు ముందు రోజే ఉత్తర కొరియా ఈ క్షిపణి ప్రయోగం చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది. ఈ విషయాన్ని జపాన్‌ కోస్ట్‌ గార్డు కూడా ధృవీకరించిందని టోక్యో రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. జపాన్‌ కోస్ట్‌ గార్డు తీరంలో ఉన్న నౌకలకు హెచ్చరికలు జారీ చేసినట్లు కూడా జపాన్‌ మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియా మరో క్షిపణి ప్రయోగం నిర్వహించనుందని హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఉత్తర కొరియా ఈ ప్రయోగానికి తెగబడటం గమనార్హం.

అమెరికా వైఎస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ చేరుకున్నారు. ఈ పర్యటన సందర్బంగా ఆమె ఉత్తర దక్షిణ కొరియాల సరిహద్దు పటిష్ట  భద్రతను పర్యవేక్షించనున్నారు. అమెరికా దక్షిణ కొరియా రక్షణ నిమిత్తం దాదాపు 28 వేల సైనికులను మోహరించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events