Namaste NRI

రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు.. భిన్నమైన ప్రేమకథా చిత్రమిది

సాత్వికారాజ్ కథానాయికగా నటించిన చిత్రం నీతో. అభిరామ్ వర్మ కథానాయకుడు. బాలు శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సాత్వికారాజ్ మాట్లాడుతూ నిశ్చితార్థం అయిన అమ్మాయికి, అనుకొని కొన్ని పరిస్థితుల వల్ల ఎలాంటి సమస్యలొచ్చాయి? వాటిని ఎలా ఎదుర్కొందన్నది కీలకం అన్నారు. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఇది రెగ్యులర్ లవ్సోర్టి కాదు.. వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథలతో చూస్తే చాలా వినూత్నంగా ఉంటుంది. తప్పకుండా ఈ చిత్రం అందరి నచ్చుతుందని, నాయికగా నాకు మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పింది.

Social Share Spread Message

Latest News