Namaste NRI

నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్, ట్రోఫీలు అందజేసిన దేవినేని ఉమా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ టెక్సస్‌లో సెప్టెంబర్ 3న వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. టెక్సస్ లోని నాట్స్ డాలస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ 12వ ఎడిషన్ వాలీబాల్ టోర్నమెంట్‌లో దాదాపు 28 టీంలు ఈ టోర్నమెంట్‌లో ఆడే అవకాశం లభించింది. టెక్సాస్‌లోని గ్రేప్‌వైన్, ఫీల్డ్ హౌస్‌ వేదికగా ఈ టోర్నమెంట్ జరిగింది. నాట్స్ ప్రో కప్, నాట్స్ అడ్వాన్స్‌డ్ కప్ ఇలా రెండు విభాగాలుగా వాలీబాల్ పోటీలు జరిగాయి. వాలీ వాల్వ్స్ జట్టు నాట్స్ ప్రో కప్‌ను సొంతం చేసుకోగా. గ్రావిటీ విన్స్ టీం రన్నరప్‌గా నిలిచింది. నాట్స్ అడ్వాన్స్స్‌డ్ కప్‌ను వీవీఎస్ టీం సొంతం చేసుకుంది. వికింగ్స్ టీం రన్నరప్‌గా నిలిచింది. నాట్స్ డాలస్ క్రీడా విభాగం, నాట్స్ సభ్యులు ఈ టోర్నమెంట్ విజయవంతం చేయడానికి కృషి చేసి నందుకు నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అభినందించారు.

Social Share Spread Message

Latest News