Skip to main content

Namaste NRI

జర్మనీలో ఎన్నారైలు వినూత్న నిరసన

తెలుగుదేశం  పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ  జర్మనీ లోని మైంజ్ పట్టణంలో ఎన్నారైలు వినూత్న ప్రదర్శన చేశారు. చంద్రబాబు వెంటనే బయటకు వచ్చేలా న్యాయం జరగాలని న్యాయం కోసం బిక్షాటన పేరిట న్యాయదేవత ఎదుట జోలిపట్టి అభ్యర్థించారు. ఆ తరువాత న్యాయానికి సంకెళ్లు పేరుతో టీడీపీ ఇచ్చిన నిరసన కార్యక్రమానికి స్పందిస్తూ, కండువాలతో వారి చేతులను బంధించుకుని ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా ప్రసంగించిన ఒక మహిళ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కలతచెంది కన్నీటి పార్వంతులయ్యారు.

Social Share Spread Message

Latest News