Skip to main content

Namaste NRI

న్యూయార్క్‌ లో సిఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు

అమెరికాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగ తం లభించింది. న్యూయార్క్ విమానా శ్రయం చేరుకున్న సిఎం బృందానికి ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు జై రేవంతన్న  జైజై రేవంతన్న  రేవంతన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదా లు చేశారు. అభిమానులు, కాంగ్రెస్ ఎన్నారైలు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. విమానాశ్రయానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు. అక్కడ దిగ్గజ కంపెనీ ల అధినేతలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. తెలంగాణ కు పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి, ఆయన బృందం విదేశాలలో పర్యటిస్తోంది. ఈ నెల 14న తిరిగి తెలంగా ణకు రానున్నారు. 10 రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లారు సీఎం. అక్కడ తెలుగువారు బోకేలతో రేవంత్ కు ఘన స్వాగతం పలికారు.

Social Share Spread Message

Latest News