Skip to main content

Namaste NRI

ఛార్లెట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలు

మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అభిమానుల ఆరాధ్యరాముడు శ్రీ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఛార్లెట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పలువురు హాజరై ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంకోసం ఛార్లెట్‌ నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళి వారివారి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి వచ్చారు. వారంతా తమ అనుభవాలను వచ్చినవారితో పంచుకున్నారు.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రగతి సాధించగలదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని స్మరించుకుంటూ ఆయన నటించిన ఎన్నో సినిమాలు అందరి గుండెల్లో నేటికీ చెరగని ముద్రవేసుకుని ఉన్నాయని చెప్పారు.

Social Share Spread Message

Latest News