Namaste NRI

ఉక్రెయిన్‌కు అణు ముప్పు తప్పదా?

ఉక్రెయిన్‌పై యుద్దాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు యత్నిస్తోన్న రష్యా ఇకపై అణ్వాయుధాలనూ  ప్రయోగించే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై అణు బాంబుల దాడి ఘటనను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మైక్రాన్‌తో జరిపిన సంభాషణలో ఆయన ఈ ప్రస్తావన  తెచ్చారు. యుద్ధంలో గెలిచేందుకు ప్రధాన నగరాలపైనే దాడి చేయాల్సిన అవసరం లేదంటూ జపాన్‌పై అణు దాడులను పుతిన్‌ గుర్తు చేసినట్లు తెలిసింది. ఉక్రెయిన్‌ సేనల ప్రతిదాడులతో యుద్దక్షేత్రంలో కొంతకాలంగా మాస్కోకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దీంతో రష్యాను కాపాడుకునేందుకు అన్ని వనరులను వినియోగిస్తామంటూ పుతిన్‌ ఇటీవల హెచ్చరించారు. ఆయన తాజా వ్యాఖ్యలను బట్టి రష్యా అణ్వాయుధాలు ప్రయోగించే అవకాశం లేకపోలేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

          ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని రష్యా కొనసాగిస్తున్నది. ఆ దేశం అణుధార్మిక స్మార్ట్‌ బాంబ్‌ను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నది పుతిన్‌ ఇటీవల ఆరోపించారు. ఇదే జరిగితే అణు బాంబుల దాడికి తాను వెనుకాడబోమని హెచ్చరించారు. అయితే పుతిన్‌ ఆరోపణలను ఉక్రెయిన్‌ ఖండిరచింది.  అణు దాడి ఆలోచన ఉన్నవాళ్లే ఇతరులపై అలాంటి ఆరోపణలు చేస్తారని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా విమర్శించారు.

Social Share Spread Message

Latest News