Skip to main content

Namaste NRI

కల్యాణ్‌ రామ్‌ బర్త్‌ డే సందర్భంగా.. బింబిసార ట్రైలర్‌

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం బింబిసార. సంయుక్తా మీనన్‌, క్యాథరీన్‌ ట్రెసా నాయికలు. దర్శకుడు వశిష్ఠ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ నందమూరి కల్యాణ్‌ రావ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ రెండున్నరేళ్ల తర్వాత అందరినీ కలుస్తున్నానని, ఎన్నో చందమామ కథలు విన్నామని, చదివామని, కొన్ని చూశామని, కొన్ని  తాతయ్య, నానన్నమ్మ, అమ్మమలు, కొన్ని కథలను చెబితే, కొన్నింటిని మనం పుస్తకాల్లో చదివామని, కొన్నింటిని మనం తెరపై చూసుకుంటామని అన్నారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్‌ ఉన్న ఈ సినిమాలకు ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. అలాంటి అందమైన గొప్ప చందమామ కథను ఆగస్టు 5న మీ ముందుకు తీసుకొస్తున్నామని అన్నారు. అదే బింబిసార అన్నారు. ఈ సినిమా అందరూ ఆదరిస్తారని ఆశిస్తునాననని అన్నారు. దర్శకుడు వశిష్ట్‌ మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కథ విన్న మరుక్షణం నుంచి నువ్వు చేయగలవు అంటూ కథానాయకుడు కల్యాణ్‌రామ్‌, నిర్మాత హరి ఎంతో ప్రోత్సాహంచారు. మా బింబిసారుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ప్రేక్షకులు తెరపై చూస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్తా మీనన్‌, క్యాథరిన్‌, నటుడు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events