Skip to main content

Namaste NRI

ఐదేళ్ల సభ్యత్వం ఉంటేనే మా పోటీకి అర్హులు

మా సభ్యత్వం కఠినంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు (మా) మంచు విష్ణు అన్నారు. మా అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు చేపట్టిన ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విష్ణు మాట్లాడుతూ కనీసం రెండు సినిమాల్లో నటించిన వారికే శాశ్వత సభ్యత్వం ఇస్తాం. ఐదేళ్ల పాటు శాశ్వత సభ్యత్వం ఉంటేనే మా ఎన్నికల్లో పోటీకి అర్హులు అని అన్నారు. మా ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలలో 90 శాతం పూర్తి చేశాం. నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్లెట్ తయారు చేశాం. మా సొంత భవనం కోసం రెండు ప్రతిపాదనలు వచ్చాయి. వాటిని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. మా ప్రతిష్టను దెబ్బ తీసేలా మాట్లాడినా, పోస్టులు పెట్టినా చర్యలు తీసుకుంటాం. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాలో ఎంతో అలజడి ఉండేది. ప్రస్తుతం సద్దుమణిగింది. నాపై పోటీ చేసి ఓడి మా సభ్యత్వానికి రాజీనమా చేసిన ప్రకాశ్రాజ్తో ఇప్పటికి మంచి సంబంధాలు ఉన్నాయి అన్నారు. నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు మాట్లాడుతూ మా ఎన్నికల్లో విష్ణు ఓడిపోవాలని కోరుకున్న వాళ్లు కూడా బాగుండాలి. మా అంటే ఒకే కుటుంబం. సభ్యులందరూ కలిసి మెలసి ఉండాలన్నదే మా అభిమతం అన్నారు. మంచు విష్ణు చేసే పనుల్లో మోసం లేదు, దగా లేదు. అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడుతున్నాడని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events