Skip to main content

Namaste NRI

ఓపెన్‌ ఏఐ సీఈఓ ఆల్ట్‌మన్‌ కీలక ప్రకటన.. సగానికి పైగా సంపదను

మానవాళి మేలు కోసం తమ సంపదను త్యాగం చేసే బిలియనీర్ల జాబితాలో ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ చేరారు. తమ సంపదలో అత్యధిక భాగం దాతృత్వానికి అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయనతోపాటు ఆయన భాగస్వామి ఓలివర్‌ ముల్హెరిన్‌ ది గివింగ్‌ ప్లెడ్జ్‌  దాతృత్వ కార్యక్రమంపై సంతకం చేశారు. ఈ ప్రపంచం అభివృద్ధి చెందడం కోసం అనేక మంది ఎంతో శ్రమిస్తున్నారని, విజ్ఞానం, దాతృత్వం, అంకిత భావాలతో కృషి చేస్తున్నారని, వారు ఏర్పాటు చేసిన వేదిక తాము ఈ స్థాయికి చేరడానికి అవకాశం కల్పించిందని వీరిద్దరూ లేఖలో పేర్కొన్నట్లు ఈ చారిటీ సంస్థ తెలిపింది.

ది గివింగ్‌ ప్లెడ్జ్‌  చారిటీ సంస్థను వారన్‌ బఫెట్‌, బిల్‌ గేట్స్‌, మెలిందా గేట్స్‌ 2010లో ప్రారంభించారు. ప్రపంచంలోని సంపన్నులు దానం చేసేలా ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 30 దేశాలకు చెందిన 240 మంది సంపన్నులు భారీగా విరాళం ఇస్తామని ప్రకటించారు.

Social Share Spread Message

Latest News