Namaste NRI

క్రీడలపై పట్టు ఉంటే ఏ రంగంలోనైనా అవకాశం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశ వ్యాప్తంగా క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి వారిని ఒలంపిక్స్‌కు పంపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓయూలో స్పోర్ట్స్‌ క్లస్టర్‌కు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.26 కోట్లు కేటాయించింది. ఇందులో ఓయూకే 13.5 కోట్లు కేటాయింపులు చేశామన్నారు. క్రీడలపై పట్టు ఉంటే ఏ రంగంలోనైనా అవకాశం ఉంటుందని అన్నారు. అందుకు ప్రతి విద్యార్థి ఏదో ఆటపై పట్టు పెంచుకోవాలని ఖేల్‌ ఇండియా పథకం కింద కేటాయించిన నిధులతో ఓయూలో మహిళ స్విమ్మింగ్‌పూల్‌, సింధటిక్‌ అథ్లెటిక్‌ ట్రాక్‌. సింధటిక్‌ టెన్నిస్‌ కోర్టు ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అనాన్నారు.

                 విద్యార్థులు ఆటలపై ఆసక్తి పెంచుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక క్రీడలు, క్రీడారులకు మంచి ప్రోత్సాహం లభిస్తున్నది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తున్నాం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఓయు వీసీ రవీందర్‌, రిజిస్ట్రార్‌ లక్ష్మీ నారాయణ, నగర డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత శోభన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events