తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.గౌతంరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర తర్వాత జిల్లాల్లో రాత్రి నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, గద్వాల జోగులాంబ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి బి.వెంకట్‌రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు కె.గీతామూర్తి, పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.