Namaste NRI

స్వాతిముత్యం వాయిదా

గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్‌ కె.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం స్వాతిముత్యం. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేశారు. రిలీజ్‌ డేట్‌ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసి, రిలీజ్‌ ప్లాన్స్‌తో ముందుకు వెళ్లానుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా రిలీజ్‌ను వాయిదా వేయక తప్పడం లేదు. కరోనా తర్వాత తెలుగు చిత్రపరిశ్రమ అంత గొప్పగా లేదు. మునుపటిలా ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు. మా సినిమా విడుదలకు సరైన సమయం కుదిరినప్పటికీ ప్రస్తుత పరిస్థితి. ఇతర నిర్మాతల పరిస్థితిని ఆలోచించి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాం అని చిత్రయూనిట్‌ పేర్కొంది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశాయి.  నరేష్‌, రావు రమేష్‌, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, సప్తగిరి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌.

Social Share Spread Message

Latest News