Skip to main content

Namaste NRI

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు.. తమిళనాడు గ్రామంలో సంబరాలు, ఎందుకో తెలుసా?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు  నవంబర్‌ 5న జరగనున్న విషయం తెలిసిందే. డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కమలా హరిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా పోరు కొనసాగుతుం డటంతో,  ఎవరు గెలుస్తారనేది అన్ని దేశాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కమలా హారిస్ పూర్వీ కుల గ్రామం అయిన మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తులసేంద్రపురంలో మాత్రం ఇప్పటికే సంబరాలు ప్రారంభం అయ్యాయి. తులసేంద్రపురం మొత్తం కమలా హారిస్ ఫ్లెక్సీలతో నిండిపోయింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలవాలని తులసేంద్రపురంలో పూజలు నిర్వహిస్తున్నారు.

కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ భారతీయురాలు. శ్యామల తండ్రి గోపాలన్‌ తమిళనాడులోని తుల సేంద్రపురంలో పుట్టారు. గోపాలన్ భారత ప్రభుత్వ అధికారిగా పలు హోదాల్లో పని చేశారు. కమలా హారిస్‌ తల్లి శ్యామల గోపాలన్ 19 ఏళ్ల వయసులో ఉన్నపుడు పై చదువుల కోసం అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. అక్కడ శ్యామలా గోపాలన్ రొమ్ము క్యాన్సర్‌పై అనేక పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారిస్‌ను శ్యామల గోపాలన్ పెళ్లి చేసుకున్నారు. డొనాల్డ్ హారిస్, శ్యామల గోపాలన్‌లకు పుట్టిన తొలి బిడ్డనే కమలా హారిస్‌. తాను చిన్నతనంలో ఉన్నపుడు భారత్‌లోని తన అమ్మమ్మ, తాతయ్యలను కలిసి నట్లు ఇటీవల కమలా హారిస్‌  వెల్లడించారు.  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పోటీ చేయడం చారిత్రాత్మకమైనదని,  అది తమకు ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా తులసేంద్రపురంవాసులు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News