Skip to main content

Namaste NRI

పరీక్ష పే చర్చ 2026 కార్యక్రమంలో విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిన ప్రధాని మోదీ

పిల్లల పరీక్షల సమయంలో తీవ్ర ఒత్తిడిలో ఉంటారు అందుకని విద్యార్థులలో ఒత్తిడి దూరం చేసి ఆత్మవిశ్వాసం నింపడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమం పరీక్ష పే చర్చ 2026 నిర్వహించారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమంలో మోదీ పిల్లలతో కలిసి మాట్లాడుతారు ఈ సారి కూడా పిల్లల అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇంటర్నెట్ ఉచితంగా వస్తుందని దాని మీద సమయం వృథా చేయవద్దు అన్నారు. పరీక్షలను సానుకూలంగా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మోదీ పిల్లలతో మాట్లాడుతూ నేను ప్రధాని అయ్యాను కాని పనితీరు విషయంలో ప్రజల సూచనలు తీసుకుంటానని చెప్పారు. తద్వారా పనిలో మార్పులు చేసుకుంటాను ani చెప్పారు. చదువుతో పాటు ఆటలు విశ్రాంతి మంచి అలవాట్లు, నైపుణ్యాన్ని పెంపొందించు కోవాలని సూచించారు. జూదం, బెట్టింగు వంటి చెడు వ్యసనాలకు బానిసలు కావద్దు అని సూచించారు.

Social Share Spread Message

Latest News