Skip to main content

Namaste NRI

ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఫుట్‌బాల్ ఆడారు. సిక్కిం 50 వ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రధాని అక్కడి క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు.ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేశారు. గాంగ్‌టక్ లో యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. ప్రధాని క్రీడా దుస్తులలో పిల్లలతో కలిసి ఆడిన ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. సిక్కిం 50 వ ఆవిర్భావ దినోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన ప్రధాని రూ. 4000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. సిక్కిం రాష్ట్రం భారత్ యూనియన్ లో చేరి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిక్కిం ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగంమే ప్రధాన ఆధారం. కావున రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం ప్రధాని రోడ్ షో లో పాల్గొన్నారు. త్వరలో రోప్ వే, స్కైవే వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తాయని అన్నారు.

Social Share Spread Message

Latest News