ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)ల విధించిన ఆర్థిక ఆంక్షలను తాము సమర్థించడం లేదని చైనా ప్రకటించింది. అదే సమయంలో ఈ యుద్దంలో ఉక్రెయిన్ పౌరులకు అపారనష్టం జరగడం చూసి తామెంతో ఆందోళన చెందుతున్నామనీ పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్‌లు సమస్యను సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాకు ఫోన్ చేసి మాట్లాడారు. పరిస్థితి అదుపు తప్పి పోకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
ఉక్రెయిన్‌లో 6,000 పైచిలుకు చైనీయులను, విద్యార్థులను స్వదేశానికి తరలించడానికి బీజింగ్ ప్రాధాన్యమిస్తోంది. విదేశీయుల తరలింపునకు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లును ఏర్పాటు చేసినందుకు కులేబాను అభినందించారు. స్వీయ భద్రతపై రష్యా చేస్తున్న న్యాయమైన డిమాండ్లను గంభీరంగా పరిగణనలోకి తీసుకొని, ఉక్రెయిన్ సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనాలని సూచించారు. రష్యా దండయాత్రన ఖండిరచడానికి నిరాకరిస్తూ ప్రచ్చన్న యుద్ధ కాలంనాటి ఆలోచనా విధానాన్ని అందరూ వదలించుకోవాలన్నారు.














