Namaste NRI

బాడీగార్డ్ ల మధ్య బుట్టబొమ్మ .. జన్మదిన వేడుకలు

బుట్టబొమ్మ బుట్టబొమ్మ అంటూ తెలుగు ప్రేక్షకులు పదేపదే పాడుకొనేలా తన అందంతో అలరిస్తున్న నాయిక పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమె సల్మాన్ఖాన్తో కలిసి హిందీలో నటిస్తున్న చిత్రం కిసీ కా భాయ్ కిసీ కా జాన్. వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. గురువారం పూజ పుట్టినరోజు. ఈ సినిమా సెట్లోనే ఆమె పుట్టినరోజు వేడుకల్ని వెంకీ, సల్మాన్ దగ్గరుండి నిర్వహించి పూజాతో కేకు కోయించి శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫొటోను సల్మాన్ ట్విటర్లో పంచుకున్నారు. బాడీ గార్డ్ ల మద్య బుట్టబొమ్మ భలేగా ఉంది అంటూ నెటిజన్లు స్పందించారు. హిందీ బాడీగార్డ్లో సల్మాన్ తెలుగులో అదే పేరుతో తెరకెక్కిన చిత్రంలో వెంకటేష్ నటించిన సంగతి తెలిసిందే. పూజా హెగ్గే మరోవైపు తెలుగులో మహేశ్బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.

Social Share Spread Message

Latest News