Skip to main content

Namaste NRI

పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు .. అలా చేస్తే తగిన మూల్యం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా పైలట్లతో పుతిన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాతో సహా పశ్చిమ దేశాలు తమపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానమని  అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ పుతిన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాలో మార్షల్‌ లా అవసరం లేదన్నారు. ఉక్రెయిన్‌ గగనతలాన్ని ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌ విధించినా, అలా విధించాలని కోరిన యుద్ధంలో భాగమైనట్టేనని అన్నారు. ఉక్రెయిన్‌పై నో ఫ్లై జోన్‌ విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నో ఫ్లై జోన్‌ను విధించే దేశాలు రష్యాతో ఘర్షణకు సిద్ధపడాలన్నారు. నో ఫ్లై జోన్‌ విధించిన ఏ దేశమైనా మాస్కోతో వివాదంలోకి వచ్చినట్టే భావిస్తామనీ, యుద్ధంలో పాల్గొంటున్నట్టుగా పరిగణిస్తామని హెచ్చరించారు.  ఉక్రెయిన్‌ మిలిటరీ మౌలిక సదుపాయాలను నాశనం చేయడం దాదాపు పూర్తయిందని తెలిపారు.

Social Share Spread Message

Latest News